Nagarjuna: బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!

నాగార్జున (Nagarjuna) ఇటీవల ఎయిర్‌పోర్టులో ఫ్లైట్‌ కోసం నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ అభిమాని సెల్ఫీ అంటూ ఆయన వద్దకు వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే నాగార్జున అతన్ని చూడకముందే బాడీ గార్డ్ ఆ అభిమానిని పక్కకు తోసేశాడు. దీంతో ఆ అభిమాని కింద పడిపోయేవాడే.! కానీ బ్యాలెన్స్‌ చేసుకుని నిలబడ్డాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. అందరూ నాగార్జునని తిట్టిపోశారు. ఫైనల్ గా అది నాగార్జున వద్దకు వెళ్లడం..

దీంతో ఆయన వెంటనే దానిపై స్పందించడం జరిగింది. ‘ఇప్పుడే ఈ వీడియో నా దృష్టికి వచ్చింది. ఇలా జరగడం నాకు బాధగా అనిపిస్తుంది. నేను అతనికి క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను’ అంటూ నాగార్జున ట్వీట్ వేశారు. ఇక తాజాగా మరోసారి ఎయిర్పోర్ట్ కి వెళ్లిన నాగార్జున.. ఈసారి ఆ అభిమానిని పిలిపించుకుని మరీ దగ్గరకు తీసుకుని క్షమాపణలు చెప్పారు.

‘నీ సైడ్ నుండి ఎలాంటి తప్పు లేదు. తప్పంతా మాదే’ అంటూ అతనికి హిందీలో వివరించారు నాగార్జున. దీంతో ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది. నాగార్జునపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ‘నిజంగా కింగే’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే కేవలం సోషల్ మీడియాలో నెటిజెన్ల ట్రోలింగ్ కు భయపడి..

నాగ్ ఇలా చేశారు అనుకోవడానికి లేదు. సీనియర్ హీరోల్లో చాలా మంది తమ మీదకు వచ్చిన అభిమానుల పై చెంపదెబ్బలు వేస్తున్న దృశ్యాలు చూసి కూడా.. ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్లు చేయడం సరికాదు అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus