Maruthi, Prabhas: మారుతీతో ప్రభాస్ సినిమా.. మళ్ళీ ఏంటి ఈ కన్ఫ్యూజన్..!

  • April 8, 2022 / 07:55 PM IST

‘సాహో’ ‘రాధే శ్యామ్’ సినిమాల ఫలితాలతో ప్రభాస్ అభిమానులు బాగా ఢీలా పడిపోయారు. ‘సాహో’ అయినా ప్రభాస్.. మాస్ స్టామినాకి తగ్గ ఓపెనింగ్స్ ను రాబట్టింది. కానీ ‘రాధే శ్యామ్’ ఫలితంతో వారు బాగా నిరాశ చెందారు. ఇప్పుడు ప్రభాస్ కు అర్జెంట్ గా ఓ హిట్టు కావాలి. అది కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఉండాలి. ‘సాహో’ ‘రాధే శ్యామ్’ సినిమాల విషయంలో తెలుగు నేటివిటీ బాగా లోపించింది. పాటలు, లొకేషన్స్,ప్రభాస్ లుక్..

వీటన్నిటి విషయంలో తెలుగుతనం లోపించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ సినిమాలు తెలుగు బయ్యర్స్ కు తీవ్ర నష్టాల్నే మిగిల్చాయి. అందుకే ప్రభాస్ ఓ తెలుగు దర్శకుడితో సినిమా చెయ్యాలి. అందుకే హడావిడి హడావిడిగా మారుతీ ప్రాజెక్టు వార్తల్లోకి వచ్చింది. నిర్మాత డివివి దానయ్య ప్రభాస్ కు రూ.75 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చి రెడీగా ఉన్నారు. ఏప్రిల్ 10నే ఈ చిత్రం మొదలు కాబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ కట్ చేస్తే ఆ హడావిడి ఇప్పుడు కనిపించడం.

ఏప్రిల్ 10న ప్రభాస్- మారుతీ ల సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అలా అని ఈ ప్రాజెక్టు లేనట్టా? అంటే అలాంటిదేమి లేదు. ఈ ప్రాజెక్టు మొదలవ్వడానికి ఇంకాస్త టైం పడుతుంది అని వినికిడి. ఇక మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయేది.. కామెడీ కమ్ యాక్షన్ డ్రామా. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే కంటెంట్ ఇందులో ఉందట. ముందుగా ఈ కథని చిరుకి వినిపించారు మారుతీ. చిరుకి కూడా ఈ కథ నచ్చింది.

అయితే కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు అని తెలుస్తుంది. అయితే ప్రభాస్ కు మాత్రం ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందనేది ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉండగా.. మారుతీ కెరీర్లో ఒక్క వెంకటేష్ తో తప్ప.. పెద్ద హీరోలతో పనిచేసిన సందర్భాలు లేవు. ‘బాబు బంగారం’ కనుక హిట్ అయ్యుంటే మారుతీకి పెద్ద హీరోలతో పనిచేసే అవకాశం త్వరగా వచ్చి ఉండేది. ఇప్పుడు ప్రభాస్ తో తీసే సినిమా సక్సెస్ అయితే ఆయన దశ తిరిగినట్టే..!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus