Jr NTR, Ram Charan: ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఇలా గొడవ పడితే ఎలా?

  • March 14, 2022 / 08:20 PM IST

దాదాపుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ కు మరో 10 రోజులు మాత్రమే ఉండగా ఈరోజు నుంచి మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచనున్నారు. వరుసగా ఈవెంట్లను నిర్వహిస్తూ సినిమా రిలీజ్ సమయానికి ఆకాశమే హద్దుగా అంచనాలను పెంచాలని జక్కన్న అనుకుంటున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందే నిర్మాతకు భారీస్థాయిలో లాభాలను అందించగా సినిమా రిలీజైన తర్వాత లాభాలు మరింత పెరుగుతాయని తెలుస్తోంది.

Click Here To Watch Now

ఆర్ఆర్ఆర్ మూవీ లాభాల్లో జక్కన్నకు 30 శాతం వాటా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు పెరుగుతాయని ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే చరణ్, తారక్ అభిమానుల ప్రవర్తనను గమనిస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు రావడం కష్టమేనని తెలుస్తోంది. చరణ్, తారక్ లకు ప్రేక్షకుల్లో సమానంగా క్రేజ్, పాపులారిటీ ఉంది. అయితే మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటూ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రిలీజవుతున్న పోస్టర్లలో చరణ్ అభిమానులు తారక్ లేకుండా తారక్ అభిమానులు చరణ్ లేకుండా ఫోటోలను ఎడిట్ చేస్తుండటం గమనార్హం. ఇద్దరు హీరోల అభిమానులు ఈ విధంగా చేయడం వల్ల సినిమాకు నష్టమే తప్ప లాభం ఉండదు. హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండగా అభిమానులు గొడవలు పడటం సినిమాకు కూడా మంచిది కాదు. ఆర్ఆర్ఆర్ హీరోలు కలిసి ఉన్న విధంగా అభిమానులు కూడా కలిసి ఉంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ తో చరణ్, తారక్ పాన్ ఇండియా హీరోలుగా ఎదగడంతో పాటు టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచే దిశగా కృషి చేయాలని అభిమానులు భావిస్తే బాగుంటుంది. ఈ ఇద్దరు హీరోల భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus