దేవర (Devara) సినిమా చూసిన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులను కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా కాకుండా ఒకే పార్ట్ గా తెరకెక్కించి ఉంటే బాగుండేదని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అండర్ వాటర్ సీక్వెన్స్ లు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అయితే దేవర అభిమానులకు ఎన్నో ప్రశ్నలను మిగిల్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర క్లైమాక్స్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు ట్విస్టులు ఉంటాయి.
ఆ రెండు ట్విస్టులను ఏ విధంగా కన్విన్స్ చేస్తారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో గ్యాంగ్ స్టర్ యతి ఎవరు? మురుగ ఎలా చనిపోయారు? సంద్రంలో దేవర ఉన్నాడని భయపడుతున్న భైరాకు అసలు నిజాలు తెలుస్తాయా? జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్రకు రెండో భాగంలో అయినా ప్రాధాన్యత ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో కొరటాల శివ (Koratala Siva) జాగ్రత్త పడి ఉంటే బాగుండేదని మొదట వర పాత్ర పరిచయం అయ్యేలా సినిమా తెరకెక్కించి ఉంటే సినిమా రేంజ్ పెరిగేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. దేవర, వర పాత్రలకు మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో వేరియేషన్ చూపించారు. దేవర మూవీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని తారక్ గతంలో కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నిజమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
దేవర సినిమా రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో సినీ ఫ్యాన్స్ దృష్టి ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) , గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలపై ఉంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటాయో చూడాల్సి ఉంది. యతి రోల్ లో బాబీ డియోల్ (Bobby Deol) కనిపించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.