‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్లో రూపొందిన ‘దేవర’ (Devara) (మొదటి భాగం) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే మార్నింగ్ షోలు చూసిన ప్రేక్షకులు కొంచెం బెటర్ టాక్ చెప్పారు. అసలు ఎందుకు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది అంటే చాలా కారణాలు ఉన్నాయి. అర్ధరాత్రి షోలు వేయడం దగ్గర్నుంచి చాలా వ్యవహారాలు ఉన్నాయి. అయితే ప్రప్రధమంగా సినిమాలో ఉన్న ప్లస్సులు ఏంటి.. మైనస్సులు ఏంటి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :
ముందుగా పాజిటివ్ పాయింట్స్ :
1) ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ గురించి మెయిన్ గా చెప్పుకోవాలి. దేవరగా, వరగా.. రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలో చాలా బ్యాలెన్స్డ్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ‘దేవర’ గెటప్లో ఎన్టీఆర్ బాగున్నాడు. ఆ పాత్రని దర్శకుడు డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. సెకండ్ పార్ట్ కూడా ఈ పాత్ర చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది అని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చిన విధానం కూడా ఆకట్టుకుంది.
2) ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మంచి మాసీగా ఉంది. పెళ్లి సీన్లో ఎన్టీఆర్(దేవర) చేసిన డాన్స్ కూడా మెప్పించింది. ఇక ఇంటర్వెల్ ఫైట్ కూడా ఊర మాస్ అనిపించింది.
3) రత్నవేలు (R. Rathnavelu) సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చింది. మెయిన్ గా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కి రత్నవేలు పనితనం అద్భుతం. ‘నెలవంకకి రక్తంతో చేసిన సర్కిల్’ విజువల్ గురించి దశాబ్ద కాలం పాటు మాట్లాడుకుంటారు ఆడియన్స్ అనడంలో సందేహం లేదు. అండర్ వాటర్ సీక్వెన్స్..లు కూడా బాగా డిజైన్ చేశాడు.
4) ‘దేవర’ కి ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగా కుదిరింది.
5) చుట్టమల్లె సాంగ్ ని చాలా బాగా చిత్రీకరించారు. చూడడానికి చాలా బాగుంది. సీరియస్ గా సాగుతున్న డ్రామాలో ఈ పాట ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ఇచ్చేలా ఉంటుంది.
6) అనిరుథ్ (Anirudh Ravichander) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. టైటిల్ కార్డ్స్ కావచ్చు, ఎన్టీఆర్ ఇంట్రో సీన్ కావచ్చు… ఎన్టీఆర్ ది బెస్ట్ ఇచ్చాడని చెప్పవచ్చు.
7) క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది.
మైనస్ పాయింట్స్ :
8) ‘దేవర’ కథ కొత్తగా ఏమీ ఉండదు. చాలా పాత సినిమాల్లో చూసిన కథే..! ఇదొక డ్రా బ్యాక్.
9) హీరోయిన్ జాన్వీ కపూర్ ఎంట్రీ సెకండాఫ్ వరకు రాదు. ఆమె పాత్రకి కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో పాటల కోసం అన్నట్టు ఉంది.బహుశా సెకండ్ పార్ట్..లో ఏమైనా కీలకంగా ఉంటుందేమో..! హీరోయిన్ ఫ్రెండ్స్ తో చేయించిన కామెడీ కూడా సెట్ అవ్వకపోగా.. ట్రోలింగ్ బ్యాచ్ కి స్టఫ్ గా పనికొచ్చేలా ఉంది.
10)సెకండాఫ్ ల్యాగ్ ఉంది. క్లైమాక్స్ బాగా డిజైన్ చేసినా… లాస్ట్ సీన్ అతికినట్టు, సెకండ్ పార్ట్ కి హైప్ తేవడానికి బలవంతంగా పెట్టినట్టు అనిపిస్తుంది.
11) సెకండాఫ్ లో వచ్చే ఆయుధ పూజ ఫైట్ సీన్ ను బాగా డిజైన్ చేసి ఉంటే మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసి హోరెత్తించే వాళ్ళు. ఇప్పుడైతే మాస్ ఆడియన్స్ ఆ ఫైట్ కి కనెక్ట్ కాకపోవచ్చు.