బాలయ్య బోయపాటి టైటిల్ ఇదేనంటున్నారు…!

బాలయ్య ఫ్యాన్స్ ఆశలన్నీ బోయపాటి శ్రీను మూవీపైనే. వరుస పరాజయాలతో డీలాపడ్డ బాలయ్య ఫ్యాన్స్ భారీ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య తన స్థాయికి హిట్టుకొట్టి ఏళ్ళు దాటిపోతుంది. ఇక ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టిన చివరి చిత్రం నరసింహనాయుడు. ఆ మూవీ విడుదలైన దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. మరి ఆ స్థాయి విజయం కాకపోయినా ఓ క్లీన్ హిట్ కొట్టాలనేది బాలయ్య ఫ్యాన్స్ కోరిక.

ఎన్టీఆర్ బియోపిక్స్ తో ఆ కోరిక తీరుతుందని నందమూరి అభిమానులు భావించారు. ఐతే అది జరగకపోగా బాలయ్య పేరిట చెత్త రికార్డ్స్ నమోదు అయ్యాయి. దీనితో బాలయ్య ఫ్యాన్స్ బోయపాటితో చేస్తున్న హ్యాట్రిక్ మూవీతో హిట్ కొడతాం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. కాగా ఈ చిత్రంతో బాలయ్య ఫ్యాన్స్ కోరిక తప్పక నెరవేరేలా కనిపిస్తుంది. బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పంచ కట్టులో బాలయ్య లుక్ కి మంచి స్పందన రావడం జరిగింది.

ఈ మూవీలో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్ర టైటిల్స్ పై అనేక రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. మొదట మోనార్క్ అనే టైటిల్ ప్రధానంగా వినిపించింది. ఆ తరువాత సూపర్ మ్యాన్, మొనగాడు అనే టైటిల్స్ కూడా పరిశీలనతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజా బొనాంజా అనే టైటిల్ ఈ మూవీ కోసం పరిశీలిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus