సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొమరం భీమ్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కొమరం భీం ఎన్టీఆర్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. వారి సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. దీనికి కారణం వారి ఆశలు చిగురించినట్లు తెలుస్తుంది. రెండు మూడురోజుల్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలు కావడం అంటే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోకి సమయం దగ్గర పడుతున్నట్లే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి రాజమౌళి చాలా రోజుల క్రితమే ప్రామిస్ చేశారు.

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైన వెంటనే ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేస్తాను అన్నారు. మరి షూటింగ్ మొదలవుతుందని సూచనలు వస్తుండగా కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోతో సోషల్ మీడియా రికార్డులు బ్రేక్ చేయాలని ఇప్పటి నుండే ఫ్యాన్స్ ప్రణాళికలు వేస్తున్నారు. అలాగే ఈ నెలలో రాజమౌళి బర్త్ డే ఉంది. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోకి ముందే ఫస్ట్ గ్లిమ్స్ రానుందని ఆరాట పడుతున్నారు. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటువంటి సంధర్భంగా లేకపోయినా సోషల్ మీడియాలో కొమరం భీమ్ ఎన్టీఆర్ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ బర్త్ డే మే 20న ఆర్ ఆర్ ఆర్ నుండి ఆయన ఫస్ట్ లుక్ వీడియో విడుదల కావాల్సి వుంది. అప్పటికి లాక్ డౌన్ మొదలు కావడం వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఫస్ట్ లుక్ వీడియోకి కావలసిన మెటీరియల్ లేదని రాజమౌళి వాయిదా వేశారు. చరణ్ బర్త్ డే నాడు గ్రాండ్ గా అల్లూరి ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసిన రాజమౌళి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మాత్రం తీవ్ర నిరాశకు గురిచేశారు. ఐతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus