కొత్త ఏడాదికి…సరికొత్త టైటిల్స్!!!

  • December 26, 2016 / 07:06 AM IST

సినిమా అంటేనే టాలెంట్, కొత్తదనం, అప్పట్లో దర్శకులుగా అవ్వాలి అని అనుకునే వాళ్ళు, ఎన్నో కష్టాలు పదే వాళ్ళు… పని నేర్చుకునేందుకు అసిస్టెంట్స్ గా, పని చేసేవారు…కానీ ఇప్పుడు కొత్త తరం దర్శకులు తమలోని టాలెంట్ ని షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చూపిస్తూ మంచి సినిమాలు తెరకెక్కిస్తూ టాలీవుడ్ బడా దర్శకులకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు..

తమలోని టాలెంట్ ని షార్ట్ ఫిల్మ్స్ రూపంలో చూపిస్తూ, అరుదైన కధలతో, సూపర్ స్క్రీన్‌ప్లే తో షాకింగ్ హిట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు…అయితే అదే క్రమంలో సినిమా టైటిల్స్ విషయంలో కూడా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు మన కుర్ర దర్శకులు….అదే క్రమంలో ఫిల్మ్ చేంబర్ లో కొన్ని సరికొత్త టైటిల్స్ నమోదయినట్లు వస్తున్న సమాచారం చూస్తుంటే….రాబోయే సరికొత్త ఏడాదికి డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి అని ఇట్టే అర్ధం అయిపోతుంది…మరి ఆ సినిమా టైటిల్స్ పై ఒక లుక్ వేద్దాం రండి…టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎంఎస్ రాజు..

ఆయన నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించాయి. ‘నాన్నతో ప్రయాణం’.. ‘రాఠీ’ అనే పేర్లు వీరి ఖాతాలోకి చేరాయి. మొదటి టైటిల్ వినగానే ఫ్యామిలీ డ్రామా అనే సంగతి తెలిసిపోతుండగా.. రాఠీ టైటిల్ తో ఓ మాస్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దర్శకుడు మారుతి.. తన మారుతి టాకీస్ బ్యానర్ పై ‘పెళ్లి కళ’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. పెళ్లి కళ కూడా ఆసక్తి రేపుతోంది. ఇలా కొత్తరకం అయిన టైటిల్స్ లో దూసుకుపోతున్నారు మన దర్శకులు…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus