పవన్‌ సినిమాలో నిధి ఫైనల్‌

  • January 28, 2021 / 11:34 AM IST

పీరియాడికల్‌ సినిమాలంటే హీరోల ఎంపిక ఎంత ముఖ్యమో… హీరోయిన్ల ఎంపిక కూడా అంతే ముఖ్యం. అప్పటి లుక్‌కి ఆ హీరోయిన్‌ నప్పకపోతే సినిమా బోల్తా కొట్టే అవకాశం ఉంది. అందుకే అలాంటి సినిమాల హీరోయిన్ల విషయంలో మన దర్శకులు ఆచితూచి అడుగులేస్తుంటారు. అలా పవన్‌ – క్రిష్‌ సినిమా విషయంలో కూడా హీరోయిన్‌ విషయంలో చర్చలు చాలా రోజుల నుంచి జరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా హీరోయిన్‌ ఎంపిక పూర్తయిందని సమచారం. అప్పుడెప్పుడో వచ్చిన వార్తలే నిజమయ్యాయి.

క్రిష్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ సరసన నిధి అగర్వాల్‌ను ఫైనల్‌ చేశారట. దీని మీద ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఆమెనే ఓకే చేశారని తెలుస్తోంది. ఈ సినిమా మొదలైన చాలా రోజులైనా హీరోయిన్‌ ఎంపిక ఇప్పుడు అయ్యిందట. అది కూడా ఆమె మీద కొన్ని సీన్లు, పాట చిత్రీకరించి అంతా ఓకే అన్నాకే ఆమెను ఎంపిక చేశారట. షూట్‌ చేసిన సీన్స్‌ను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకున్నాక.. నిధిని ఫైనల్‌ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

క్రిష్‌ సినిమా… పవన్‌ సాధారణ సినిమాలకు డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. ఇందులో పవన్‌ ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్‌లో ఉంటాడట. రాబిన్‌ హుడ్‌ స్టయిల్‌ అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌ కూడా నటిస్తోందని తెలుస్తోంది. ఇందులో ఆమె రాణిగా కనిపింబోతోందట. ఈ సినిమాతో భారీ చిత్రాల నిర్మాత ఏఎం రత్నం మళ్లీ తెలుగులో నిర్మాతగా వస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus