మెగా డాటర్ నిహారిక.. లాక్ డౌన్ టైంలో అంటే డిసెంబర్ 9న .. చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ ప్యాలెస్ లో ఆమె పెళ్లి ఘనంగా జరిగింది. అయితే కొంత కాలంగా ఈ జంట విడిగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.దీంతో నిహారిక – చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అనే టాక్ కూడా ఎక్కువైంది. కానీ ఆ వార్తలపై వీళ్ళు స్పందించింది లేదు. మరోపక్క నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
దీంతో (Niharika) నిహారిక – చైతన్య ల మేటర్ ను అంతా లైట్ తీసుకున్నారు. కానీ ముందు నుండీ జరిగిన ప్రచారమే నిజమైంది. నిహారిక – చైతన్య లు విడాకులకు దరఖాస్తు చేసుకోవడం కోసం మే 19 న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుకి వెళ్లారట. దీంతో ఇక ఈ జంట విడాకులు తీసుకున్నట్టే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. కుటుంబ సభ్యులు వీళ్ళని కలపాలి అని చాలా చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోయిందని సమాచారం.
ప్రస్తుతం ఈ టాపిక్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. నిహారిక అభిమానులు ఈ వార్తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి నిహారిక వెబ్ సిరీస్ లు నిర్మించడానికి రెడీ అయ్యింది. ఆల్రెడీ డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇంకా మరికొన్ని వెబ్ సిరీస్ లు నటించడానికి స్క్రిప్ట్ లు కూడా వింటుంది.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!