Niharika: ‘గంగూబాయ్’ గా మారిన మెగా డాటర్.. వైరల్ అవుతున్న నిహారిక లేటెస్ట్ ఫోటోలు..!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగ బాబు కూతురిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నిహారిక మొదట వెబ్ సిరీస్ లలో నటించేది. అటు తర్వాత బుల్లితెర పై టీవీ షోలలో మెరిసింది. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా కూడా మారింది. ఆ సినిమాలో అద్భుతంగా నటించినప్పటికీ ఎందుకో ఈమెకు కలిసిరాలేదు. అటు తర్వాత చేసిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘ సూర్య కాంతం’ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.

దీంతో సినిమాలకు దూరమై వెబ్ సిరీస్ ల నిర్మాణం వైపు మళ్ళింది. కొన్నాళ్ల తర్వాత నిహారిక.. చైతన్య జొన్నలగడ్డ ని పెళ్లి చేసుకుని.. ఆ వెబ్ సిరీస్ లకు కూడా దూరమైంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటూ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ మెగా డాటర్ కి స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు నిహారిక చేసే ఫోటో షూట్లు హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి.తాజాగా ఈమె ‘గంగూబాయ్ కతియావాడి’ గెటప్ లోకి మారింది.

అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అలియా భట్ ఓ వేశ్య గా కనిపించింది. వైట్ శారీలో అలియా లుక్ వావ్ అనిపించే విధంగా ఉంటుంది. ఇప్పుడు నిహారిక కూడా అదే గెటప్ లోకి మారింది. ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus