Niharika: బికినీలో అందాలు ఆరబోస్తున్న మెగా డాటర్.. మండిపడుతున్న ఫ్యాన్స్?

మెగా కాంపౌండ్ నుండి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి నిహారిక కొణిదెల. యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా మారి పలు సినిమాలలో నటించింది. అయితే ఆమె నటించిన సినిమాలు విజయం సాధించలేకపోయాయి. దీంతో ఈ అమ్మడు హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత జొన్నలగడ్డ వెంకట చైతన్య వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న నిహారిక కొంతకాలం సినిమాలకు దూరమైంది.

ఇలా సినిమాలకు దూరమైన ఈమె వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారి ఎంతో పేరు సంపాదించుకున్నారు. అయితే నిహారిక ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. రాడిసన్ పబ్ ఇష్యు తర్వాత మళ్లీ నటించాలని నిర్ణయించుకున్న నిహారిక సిరీస్ లలో నటిస్తూ వాటికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నిహారిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

ఇటీవల స్నేహితులతో కలిసి టర్కీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా ఈ వెకేషన్ లో నిహారిక బికినీలో దర్శనం ఇచ్చింది. ఓ టర్కిష్ గర్ల్ తో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో బికినిలో ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు వైరల్ అవటంతో నిహారిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో మెగా అభిమానులు విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విమర్శలపై నిహారిక ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus