వైరల్ : మెగా డాటర్ రొమాంటిక్ డ్యాన్స్ అదుర్స్..!

నిహారిక కొణిదెల.. ఈ మెగా డాటర్ ‘ఢీ’ వంటి షోతో అలాగే కొన్ని వెబ్ సిరీస్ లతో కెరీర్ ను ప్రారంభించింది. తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి కుటుంబ సభ్యులు కాని.. మెగా అభిమానులు కానీ మొదట అంగీకరించ లేదు. అయితే ఎటువంటి గ్లామర్ రోల్స్ చెయ్యను.. కేవలం నటిగా గుర్తింపుతెచ్చుకోవడానికే ఇండస్ట్రీ కి వస్తున్నాను అని నచ్చ చెప్పి ఎంట్రీ ఇచ్చింది. ఆ మాట మీదే కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని కూడా నిహారిక ఓ సందర్భంలో చెప్పింది.

‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆ చిత్రాలు ఏమీ విజయం సాధించలేదు దీంతో మళ్ళీ వెబ్ సిరీస్ ల బాట పట్టింది.మెగాస్టార్ ‘సైరా’ చిత్రంలో ఈమె నటించినా పెద్దగా ఒరిగింది లేదు. అయితే ఇండస్ట్రీలో తక్కువ టైము మాత్రమే ఉంటాను… కాబట్టి గ్లామర్ షోకి కూడా వెనుకాడను అని నిహారిక చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా ఓ వేడుకలో డ్యాన్స్ చేసి ఆశ్చర్య పరిచింది.

Niharika Konidela Extraordinary dance with Yashwanth Master1

యష్ డ్యాన్స్ మాస్టర్ తో నిహారిక హాట్ హాట్ డ్యాన్స్ మూమెంట్స్ చేసింది. ఈమెను ఇంత హాట్ గా చూడటం ఇదే మొదటిసారి కావచ్చు. ‘చెలి’ చిత్రంలోని మనోహర అనే రొమాంటిక్ సాంగ్ కు నిహారిక ఎంతో రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.


‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus