మెగా డాటర్ నిహారిక.. పరిచయం అవసరం లేని పేరు. కెరీర్ ప్రారంభంలో బుల్లితెర పై ‘ఢీ’ వంటి షోలలో మెంటర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ వంటి సినిమాల్లో నటించింది. అవి పెద్దగా ఆడలేదు. దీంతో నిహారిక హీరోయిన్ గా నిలబడలేకపోయింది. ‘సైరా’ వంటి సినిమాలో నటించినా ఈమెకు క్రెడిట్ ఏమీ దక్కలేదు. తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్ లలో నటించడానికి రెడీ అయ్యింది.
కానీ లాక్ డౌన్ రావడంతో ఆమెకు పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు రెడీ అయ్యారు. చైతన్య జొన్నలగడ్డ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె… ఊహించని విధంగా విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చింది. ఇదిలా ఉండగా.. విడాకుల తర్వాత నిహారిక తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ప్రతి ఫోటో పై డిస్కషన్లు జరుగుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో తెల్ల చీరలో కనిపించింది.
ఓ పక్క నడుము అందాలు చూపిస్తూనే మరోపక్క సీరియస్ గా మొహం పెట్టింది. ఈ ఫోటోని డీప్ గా అబ్సర్వ్ చేస్తే.. గుడిలో ఉండే కోనేటిలో ఈమె పుణ్య స్నానం ఆచరించడానికి రెడీ అవ్వగా తీసిన ఫోటోలు ఇవి అని స్పష్టమవుతుంది. అంతేకాదు ‘బ్రహ్మచారిణి’ అంటూ మొదలు పెట్టి ‘తెలుపు రంగు అనేది జ్ఞానానికి, వివేకానికి గురుతు అంటూ రాసుకొచ్చింది. దీంతో (Niharika) ‘ఆమె ఏ ఉద్దేశంతో ఈ కామెంట్ పెట్టిందో’ అంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!