నిహారిక… కొత్త ‘వెబ్ సిరీస్’ అనే ఫీలింగ్ తెప్పిస్తున్న ‘సూర్యకాంతం’ టీజర్..!

  • January 28, 2019 / 07:59 AM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో ‘నిర్వాణ సినిమాస్’ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘సూర్య కాంతం’. నిహారిక తో ‘ముద్దపప్పు ఆవకాయ’ వంటి షార్ట్ ఫిలిం తెరకెక్కించిన ప్రణీత్ బ్రమండపల్లి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. గతంలో నిహారిక ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ వంటి చిత్రాలు చేసినప్పటికీ నిహారికా హిట్టునైతే సాధించలేకపోయింది.

ఇక తాజాగా ‘సూర్య కాంతం’ టీజర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో విడుదల చేయించింది చిత్ర యూనిట్. ‘నీ పేరేంటి..? అని హీరో అడుగగా… ‘పేరు తెలుసుకుని ఏమ్చేస్తావ్..? రేపు నీకు పుట్టబోయే పిల్లలకి పెట్టుకుంటావా..?’ అంటూ నిహారిక పంచ్ డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. నిహారిక నటనతో ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ‘తినడానికి పునుగులు లేవు గానీ.. బెగ్గర్ కి బర్గర్ తినిపించాడంట.. నీలాంటి వాడు’ అని నిహారికా చెప్పే డైలాగ్ ఈ టీజర్ లో హైలెట్ అని చెప్పుకోవచ్చు.

అయితే ఈ టీజర్ చూస్తున్న ప్రేక్షకులకి.. ఏ మాత్రం ఇది సినిమా టీజర్ లా మాత్రం అనిపించకపోగా… కొంచెం పెద్ద షార్ట్ ఫిలిమో… లేక ఒక ‘వెబ్ సిరీస్’ కి ట్రైలర్ చుసిన ఫీలింగ్ కలుగుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి..! ఇక ఈ టీజర్ ని మీరు కూడా ఓ లుక్కెయ్యండి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus