Niharika: నిహారిక కి టర్కీ టూర్ డైరీస్.. వైరల్ అవుతున్న వీడియో..!

  • October 22, 2022 / 02:45 PM IST

మెగా డాటర్ నిహారిక వారం,పది రోజులుగా టర్కీ లోనే ఉంది.ఈ మధ్యనే ఓ టర్కిష్ అమ్మాయితో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫోటోని ఆమె షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో నిహారిక బికినిలో ఉండటంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఈ మధ్య కాలంలో వరుసగా టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న నిహారిక.. టర్కీ లోనే ఎక్కువ రోజులు ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికీ ఆమె అక్కడి నుండి రాలేకపోతుంది. ఈ విషయం ఆమెనే చెప్పుకొచ్చింది.

‘ఇప్పటికీ అలసిపోలేదు’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె టర్కీ టూర్ లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆమె బికినీ లో స్విమ్మింగ్ పూల్ లోకి దూకి స్విమ్ చేస్తున్న షాట్స్ హైలెట్ గా నిలిచాయి. ఇప్పుడు ఆ రీల్ వైరల్ గా మారింది. ఇక బుల్లితెర పై పలు షోలు, అలాగే వెబ్ సిరీస్ ల ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి సినిమాల్లో నటించింది.

కానీ ఇవేవీ ఆమెకు సక్సెస్ అందించకపోవడంతో తిరిగి వెబ్ సిరీస్ లలో నటించడానికి వెళ్ళిపోయింది. అటు తర్వాత లాక్ డౌన్ రావడం, ఈమెకు పెళ్లి జరగడం అందరికీ తెలిసిన సంగతే. చైతన్య జొన్నలగడ్డతో 2020 లో ఈమె పెళ్లి జరిగింది. కొంతకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వెబ్ సిరీస్ లు నిర్మించడానికి రెడీ అయ్యింది నిహారిక.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus