యూట్యూబర్ నిఖిల్ క్రిస్మస్ పార్టీలో సెలబ్రిటీల రచ్చరచ్చ.. ఫోటోలు వైరల్!

  • December 26, 2022 / 02:56 PM IST

ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన నిఖిల్ తాజాగా సెలబ్రిటీలకు క్రిస్మస్ పార్టీ ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఈ పార్టీలో పాల్గొని సందడి చేయడం గమనార్హం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో స్టార్ యాంకర్ అనసూయ కేక్ తింటూ వెరైటీ ఎక్స్ ప్రెషన్లు ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఈ క్రిస్మస్ పార్టీలో రచ్చరచ్చ చేశారని వైరల్ అవుతున్న ఫోటోల ద్వారా అర్థమవుతోంది. ఈ పార్టీలో మంచు లక్ష్మి, యాంకర్ ప్రదీప్ హైలెట్ గా నిలిచారు. యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలు, యాంకర్లు హాజరు కావడంతో ఈ పార్టీ సందడి సందడిగా జరిగిందని సమాచారం అందుతోంది. ఈ పార్టీలో వరుణ్ సందేశ్, వితికా షేరు కూడా పాల్గొని పార్టీని ఎంజాయ్ చేశారు.

టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలను ఒకే ఫ్రేమ్ లో ఇంత సంతోషంగా చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ తో సక్సెస్ ను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. శివాత్మిక రాజశేఖర్ కూడా ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. నిఖిల్ సోషల్ మీడియా ద్వారా క్రిస్మస్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటున్నారు.

యూట్యూబర్ నిఖిల్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిఖిల్ పార్టీని చాలా గ్రాండ్ గా పార్టీని నిర్వహించడంతో పాటు పార్టీకి వచ్చిన సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పడం గమనార్హం. నిఖిల్ తో ఉన్న పరిచయాలు, నిఖిల్ మంచి స్వభావం వల్లే ఇంతమంది సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరయ్యారని సమాచారం.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus