Nikhil: కార్తికేయ2 శాటిలైట్ హక్కులు అన్ని కోట్లా?

  • September 4, 2021 / 08:56 AM IST

హ్యాపీడేస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నిఖిల్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమందికి మందులు సహాయం చేసి నిఖిల్ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ2 సినిమాల్లో నటిస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో కార్తికేయ ఒకటనే సంగతి తెలిసిందే. కార్తికేయకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ2 సినిమాకు భారీ ఆఫర్ వచ్చిందని సమాచారం.

కార్తికేయ2 శాటిలైట్ హక్కులతో పాటు డబ్బింగ్ హక్కులకు 20 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. నిఖిల్ సినిమాకు 20 కోట్ల రూపాయలు అంటే భారీ ఆఫర్ అనే చెప్పాలి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు అధ్యాత్మికతకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఉండనుందని సమాచారం. ఈ సినిమా రిజల్ట్ పై నమ్మకం ఉండటంతో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈ సినిమాకు భారీ ఆఫర్ ను ఇవ్వడంతో పాటు అడ్వాన్స్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది.

నిఖిల్ కు జోడీగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. షూటింగ్ దశలోనే నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా రికార్డులు క్రియేట్ చేస్తున్న కార్తికేయ2 థియేట్రికల్ బిజినెస్ ద్వారా రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని నిఖిల్ నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus