వీరభద్ర క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్ మరియు హేమలత (బుజ్జి) హీరో హీరోయిన్ గా నాటితరం హీరో హీరోయిన్లు సుహాసిని, సుమన్, భాను చందర్, షాయాజీ షిండే కీలక పాత్రలలో కె.గోవర్ధన్‌రావు దర్శకత్వం లో హేమలతా రెడ్డి నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం నిన్నే చూస్తు . వైజాగ్ పరిసరప్రాంతాల్లో ముఖ్య తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలతో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత హేమలతా రెడ్డి మాట్లాడుతూ “నిన్నే చూస్తు సినిమా ఒక్క అందమైన ప్రేమకథ చిత్రం. మనవ విలువలతో మనసుకు హద్దుకునే కుటుంబ సన్నివేశాలతో నిర్మించిన చిత్రం నిన్ను చూస్తూ . అద్భుతమైన కథ కథనం తో ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలుపెట్టాము త్వరలోనే విడుదలకు అనికార్యక్రమాలు పూర్తిచేస్తాం. అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది. దర్శకులు కె.గోవర్ధన్‌రావు గారు స్క్రిప్ట్ ని అనుకున్నదానికంటే చాల బాగా తీశారు. ముఖ్యం గా పాటలు, ప్రధాన తారాగణం అయినా సుహాసిని, సుమన్, భాను చందర్, షాయాజీ షిండే సన్నివేశాలు చాల బాగున్నాయి. ఈ సన్నివేశాలు ప్రతి కుటుంబ సభ్యుడికి నచ్చుతుంది .