తెలుగు ప్రేక్షకులకు సీనియర్ స్టార్ హీరోయిన్ లయ(Laya) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఒకప్పుడు హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో స్టార్ డమ్ తెచ్చుకుంది.లయ నటనని ఇష్టపడని ఫ్యామిలీ ఆడియన్స్ ఉండేవారు కాదు అంటే అతిశయోక్తి అనిపించుకోదేమో.
అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లయ, ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. అయితే, రీ ఎంట్రీలో ఆమెకు ఇంకా సరైన బ్రేక్ రాలేదు.
పైగా ఒక బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌ను చేజార్చుకుంది అనే వార్త తాజాగా బయటకి రావడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది లయ.శివాజీ ప్రధాన పాత్రలో, ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చి ఓటీటీని షేక్ చేసిన ’90’s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ ను అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇందులో వాసుకి నటించిన తల్లి పాత్ర కోసం మేకర్స్ మొదట లయను సంప్రదించారట. కానీ, ఆ క్యారెక్టర్ తనకు సెట్ అవ్వదని, నచ్చలేదని చెప్పి రిజెక్ట్ చేసిందట లయ. కట్ చేస్తే, ఆ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది.
వాసుకి సెకండ్ ఇన్నింగ్స్ కి బాగా హెల్ప్ అయ్యింది.మరోవైపు, లయ ఏరికోరి ఎంచుకున్న సినిమాలు మాత్రం నిరాశపరిచాయి. లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లో కెమియో చేసిన లయ… ఫుల్ లెంగ్త్ రీ ఎంట్రీ ఇచ్చింది మాత్రం నితిన్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు’ సినిమాతోనే అని చెప్పాలి. వాస్తవానికి అవి రెండూ డిజాస్టర్స్ గా మిగిలాయి. ఆ తర్వాత శివాజీతో ‘సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని’ చేసింది. అది కూడా ప్లాప్ లిస్ట్‌లోకి వెళ్ళిపోయింది. వాస్తవానికి శివాజీ- లయ..లది హిట్ కాంబినేషన్.
అందువల్ల ‘సాంప్రదాయిని సుప్పినీ సుద్దపూసని’ కచ్చితంగా హిట్ అవుతుందని భావించి.. ఓటీటీ కోసం తీసిన సినిమాని థియేటర్లలో రిలీజ్ చేశారు. అది కూడా డిజాస్టర్ అయ్యింది. సెంటిమెంట్ కూడా లయకి కలిసి రాలేదు. ప్రస్తుతం లయ చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి జగపతి బాబు హీరోగా రూపొందిన ‘వదలా’, మరొకటి శ్రీకాంత్ హీరోగా రూపొందిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. ఇవి 2 విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇవైనా లయ సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్టప్ అందిస్తాయేమో చూడాలి.