Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

రూ.4000 కోట్లతో రూపొందిన ‘రామాయణ’ సినిమాకు సంబంధించి మొన్నీ మధ్య వరకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి పెద్దగా మాట్లాడుకున్నారు. అంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి.. వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో అంచనాలు ఎంత పెట్టుకున్నా తక్కువే అని అన్నారంతా. కానీ ఆ మధ్య రావణుడు అలియాస్‌ యశ్‌ మాట్లాడుతూ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో కాస్త అటు ఇటు అయినా పట్టించుకోవద్దు.. పెద్ద మనసు చేసుకోండి అని అనేశారు.

Ramayana

దీంతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో యశ్‌ ఆఖరి రాగం పాడేశారు అని అన్నారనుకుంతా. అయితే ఇప్పుడు సినిమా దర్శకుడు నితేశ్‌ తివారీ మాట్లాడుతూ ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ కోసం పడ్డ కష్టం గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ‘నిజమేనా?’ అనే డౌట్‌ వస్తోంది. సినిమాలో రావణుడు, జటాయువు మధ్య పోరాట సన్నివేశాన్ని పూర్తి చేయడానికి ఆరున్నరేళ్లు పట్టిందన చెప్పారు. కేవలం ఈ ఒక్క యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఇంత సమయం వెచ్చించామని చెప్పి తమ పనితనం గురించి చెప్పారు.

రామాయణంలో అత్యంత కీలక ఘట్టమైన రావణుడు – జటాయువు సీన్‌ కోసం వేలాది మంది కష్టపడ్డారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ రూపకల్పనలో ఎన్నో మార్పులు చేశాం. పుష్పక విమానం తుది రూపాన్ని ఖరారు చేయడానికి రెండేళ్లు సమయం పట్టింది. దాని కోసం దాదాపు 40 నుండి 50 డిజైన్లు రూపొందించాం అని చెప్పారు. అంటే సినిమా షూటింగ్‌ ప్రారంభానికి ముందు చాలా ఏళ్లు ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డారు అని అర్థమవుతోంది.

ఆయన అంత కష్టపడుతుంటే.. ఆ మధ్య యశ్‌ మాట్లాడుతూ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌లో చిన్న చిన్న తప్పులు ఉంటే పట్టించుకోవద్దు అని అన్నారెందుకో తెలియాల్సి ఉంది. మరోవైపు సినిమాలోని విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ ఇంతటి భారీ సన్నివేశాలను చూసి కొందరు ఏఐతో రూపొందించారని అనడం బాధ కలిగిస్తోంది అనడం గమనార్హం. ఈ లెక్కలన్నీ తేలాలి ఉంటే నవంబరు 5 రావాల్సిందే.

2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus