ఆ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతోన్న నితిన్..!

  • February 22, 2020 / 06:42 PM IST

మూడు డిజాస్టర్ల తర్వాత నితిన్ స్ట్రాంగ్ కంబ్యాక్ హిట్ కొట్టాడు. ‘లై’ తో ఎక్స్పరిమెంట్ చేస్తే వర్కౌట్ అవ్వలేదు.. ‘ఛల్ మోహన్ రంగ’ తో ఎంటర్టైన్ చెయ్యాలన్నా కలిసి రాలేదు.. ‘శ్రీనివాస కళ్యాణం’ తో ఫ్యామిలీస్ ను.. కాకా పట్టాలనుకున్నా వారు పట్టించుకోలేదు. దీంతో నితిన్ కంగారు పడి వెంటనే మరో సినిమా చెయ్యలేదు. లోపం ఎక్కడుందో చెక్ చేసుకుని ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చి హిట్ కొట్టాడు. ఇక ఇదే జోష్ లో మరో రెండు సినిమాలని కూడా ఈ ఏడాదే విడుదల చేయడానికి రెడీ అయ్యాడు. అంతేకాదు నాలుగో సినిమా ‘అంథాదూన్’ రీమేక్ కూడా చేయబోతున్నాడు.

తన సొంత బ్యానర్ అయిన ‘శ్రేష్ట్ మూవీస్’ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి చిత్రాల్ని తెరకెక్కించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. అంతా బానే ఉంది కానీ ఈ చిత్రంలో టబు పాత్రకి ఎవర్ని తీసుకుంటారు అనే విషయంలో మాత్రం ఈ టీం తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారట.’అంథాదూన్’ లో టబు పాత్ర చాలా కీలకం.. బడ్జెట్ రీత్యా … కాల్ షీట్ల రీత్యా ఆమెను తీసుకోవడం కుదరట్లేదట. దీంతో మంచు లక్ష్మి, స్నేహ, అనసూయ, రెజీనా వంటి వారి పేర్లు వినిపించాయి. రమ్యకృష్ణ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చివరికి ఎవర్ని ఎంపిక చేస్తారో చూడాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus