Nithiin,Rajasekhar: నితిన్ హీరో కావడానికి రాజశేఖర్ కారణమా.. అసలేం జరిగిందంటే?

  • December 5, 2023 / 08:21 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో నితిన్ ఒకరు కాగా నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా ఈ మూవీ మినిమం గ్యారంటీ మూవీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ మాట్లాడుతూ రాజశేఖర్ వల్లే హీరో అయ్యానని కామెంట్లు చేశారు. నేను హీరోగా మారడానికి గల కారణాలలో రాజశేఖర్ గారు కూడా ఒకరని నితిన్ అన్నారు.

రాజశేఖర్ చేసిన మగాడు సినిమాతో నాన్న డిస్ట్రిబ్యూటర్ గా మారారని నితిన్ కామెంట్లు చేశారు. మా నాన్నకు డిస్ట్రిబ్యూటర్ గా అదే తొలి సినిమా అని నితిన్ చెప్పుకొచ్చారు. మగాడు సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఎక్కువ మొత్తంలో డబ్బులు రావడంతో నాన్న ఈ రంగంలో సెటిల్ అయ్యారని నితిన్ తెలిపారు. నాకు కూడా ఈ రంగంపై ఆసక్తి కలగడంతో ఈ రంగంలోకి వచ్చానని నితిన్ వెల్లడించారు.

ఒకవేళ మగాడు మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోకుండా ఉండి ఉంటే మా నాన్న సినిమాలపై ఆసక్తి చూపించేవారు కాదని నేను కూడా సినిమాల్లోకి వచ్చేవాడిని కాదని నితిన్ వెల్లడించారు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ విషయంలో నితిన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

(Nithiin) నితిన్, శ్రీలీల జోడీ మాత్రం బాగుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నితిన్ పారితోషికం 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా నితిన్ తర్వాత మూవీ వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కనుంది. మొదట ఈ సినిమాలో రష్మికను ఎంపిక చేసినా వేర్వేరు కారణాల వల్ల రష్మిక స్థానంలో శ్రీలీలను ఎంపిక చేశారు. రష్మికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus