Nithiin: వామ్మో.. సక్సెస్ కోసం నితిన్ అలా చేస్తున్నారా?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం మరో నెల రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో నితిన్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా నితిన్ సొంత బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా కావడంతో నితిన్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నితిన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రముఖ ఛానెళ్లలో ప్రసారమవుతున్న పాపులర్ టీవీ సీరియళ్లలో నితిన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారని ఇలా కనిపించి సినిమాను ప్రమోట్ చేసుకోవడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరవ్వాలని నితిన్ భావిస్తున్నారని తెలుస్తోంది. నితిన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మాచర్ల నియోజకవర్గం సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా మాస్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో కేథరిన్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి స్పెషల్ సాంగ్ లో మెరవనున్నారు. రాజ్ కుమార్ అకెళ్ల ఈ సినిమాను సమర్పిస్తున్నారు. టీవీ సీరియల్స్ లో నటించడం ద్వారా నితిన్ కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారనే చెప్పాలి. ఈ సినిమా కోసం నితిన్ మార్కెట్ ను మించి ఖర్చు చేశారని తెలుస్తోంది.

ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాత్రమే నితిన్ కెరీర్ పుంజుకుంటుందని తెలుస్తోంది. కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్ల నితిన్ మార్కెట్ అంతకంతకూ తగ్గుతోంది. నితిన్ గత సినిమా మాస్ట్రో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి ఆశించిన రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus