చెస్ ప్లేయర్ గా నితిన్ ఇరగదీశాడుగా..!

  • February 3, 2021 / 07:22 PM IST

నితిన్ నటించిన చెక్ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ గా, ప్రియా ప్రకాష్ వారియర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా రిలీజవుతున్న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఒక్కసారి మనం ట్రైలర్ ని చూసినట్లయితే, ఖైదీగా జైల్లోకి వెళ్తూ నితిన్ ట్రైలర్ మొదట్లోనే ఆసక్తిని క్రియేట్ చేశాడు. యద్భావం తద్భవతి ..! అణువు నుంచి అనంతం వరకూ ఏదీ కర్మని తప్పించుకోలేదు. అంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యింది చెక్ ట్రైలర్.

ఇక్కడే లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్ నితిన్ తరపున కేస్ ని వాదిస్తోంది. అసలు ఈ నితిన్ ఎవరు..? ఎందుకు జైల్లోకి వచ్చాడు అనేది కూడా చాలా ఇంట్రస్టింగ్ గా చూపించబోతున్నారు సినిమాలో. అందుకే ఎక్కడా కూడా కాన్సెప్ట్ ని రివీల్ చేయకుండా చెస్ గేమ్ చుట్టూనే ట్రైలర్ ని చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో చెస్ ప్లేయర్ గా నితిన్ ఇరగదీశాడు. జైల్లోకి వస్తూనే ప్రత్యర్ధిలేకపోతే గేమ్ లో మజా ఉండదు అంటూ గేమ్ ఆడేందుకు రెడీ అయ్యాడు. చెస్ గేమ్ లో ఒక్కో పావుని ఒక్కో క్యారెక్టర్ తో పోలుస్తూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఏనుగుకి ఎదురెళ్లాలి అంటే దమ్ముకావాలి.

ఒంటె పైన ఎప్పూడూ ఒక కన్నేసి ఉంచాలి. అంటూ డైలాగ్స్ ని చాలా బాగా రాశారు. అంతేకాదు, హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ తన పేరుని శబ్దం యాత్రగా చెప్తూ నితిన్ లవర్ గా కనిపిస్తోంది. ఇక నితిన్ ఆదిత్య క్యారెక్టర్ లో పూర్తిగా మునిగిపోయాడు. దేశద్రోహీగా అందరూ పిలుస్తున్న ఈ ఆదిత్య అసలు ఏం చేశాడు. ఎందుకు జైల్లో ఉన్నాడు అనేది సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతోంది. ఓవర్ ఆల్ గా ట్రైలర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ అండ్ కంటెంట్ ఉన్న సినిమాగానే కనిపిస్తోంది. ఈ సినిమాని ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నారు.మరి భీష్మతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ చెక్ సినిమాతో చెస్ గేమ్ తో ఎలాంటి మాయ చేస్తాడు అనేది చూడాలి.


30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus