టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలతో నెవర్ బిఫోర్ అనేలా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాల గోల ఏమిటో గాని ప్రభాస్ మరో సల్మాన్ ఖాన్ అయ్యేలా ఉన్నాడనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి. డార్లింగ్ రేంజ్ కు ఎంతో మంది రిచేస్ట్ అప్సరసలు రెడీగా ఉన్నప్పటికీ పెళ్లి అనేసారికి డార్లింగ్ ఇంట్రెస్ట్ చూపడం లేదు. పెళ్లికి సంబంధించిన మాటా కూడా ఎత్తనివ్వకుండా బిజీబిజీగా గడిపేస్తున్నాడు.
అలాగని మళ్ళీ ఫ్యామిలీకి దూరంగా ఉండడం లేదు. చెల్లెళ్లను, పెద్దమ్మలని, చిన్నమ్మలని అలాగే బ్రదర్స్ ను అందరిని ముంబైకి తీసుకొచ్చి వారితో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం 4 సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ కు ఎవరైనా దర్శకుడు కథ చెబితే మాత్రం అతనికి తపస్సు తప్పదు.వేరే సినిమాలు చేసుకుంటూ ఆ తరువాత ప్రభాస్ సినిమాను సెట్స్ పైకి తెస్తే పరవాలేదు గాని ఆయనను నమ్ముకొని కూర్చుంటే మాత్రం అరడజను జీవితం వృధా అయినట్లే.
రాధేశ్యామ్, సలార్ ఏడాది గ్యాప్ లో వస్తుండగా ఆది పూరుష్ కు మరో ఏడాది సమయం పడుతుంది. ఇక నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్, సిద్దార్థ్ ఆనంద్ సినిమాల కోసం నాలుగేళ్ళ సమయం పట్టవచ్చు. ఎంత అనుకున్నా కూడా ప్రభాస్ తో ఇప్పుడు కమిట్మెంట్ తీసుకుంటే మాత్రం ఐదేళ్లయినా వేయిట్ చేయాల్సిందే.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!