పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే… వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో మాత్రమే కాదు టికెట్ రేట్ల పెంపు పనుల్లో కూడా నిర్మాతలు ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఉంటారు.
‘ది రాజాసాబ్’ సినిమా టైమ్లో కూడా టికెట్ హైక్స్ పర్మిషన్ లభించకపోవడంతో మేకర్స్ పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పైగా షోలు కూడా తెలంగాణాలో టైమ్..కి పడలేదు.
అందువల్ల మొదటి రోజు ఓపెనింగ్స్ పై ప్రభావం పడింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో కూడా అలాంటి ఇబ్బందులే ఏర్పడతాయేమో అని మేకర్స్ తో పాటు అభిమానులు కూడా కంగారు పడ్డారు. అయితే అలాంటి ఇబ్బంది లేదని తెలుస్తుంది.తాజాగా సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు.
టికెట్ రేట్లు పెంచాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించిన అందరికీ సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. టికెట్ ధరల పెంపుపై ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాన్నేపాటించాలని సూచించింది. కాబట్టి.. పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోవాలంటే.. మేకర్స్ రెగ్యులర్ పద్దతినే అనుసరిస్తే సరిపోతుంది.
సో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి అడ్డంకులు తొలగినట్టే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ నేపధ్యంలో పవన్ సినిమాకి ఎంత అడిగితే అంత హైక్స్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీగానే ఉంది. ‘ఓజి’ సినిమాకి కూడా టికెట్ హైక్స్ విషయంలో ఎటువంటి లోటు చేయలేదు.