అనవసరమైన గొప్పలకి పోతున్న రకుల్ ప్రీత్ సింగ్..!

ఏ హీరోయినైనా అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు.. రెమ్యూనరేషన్ తక్కువ చెప్పినా ఒప్పేసుకుంటారనడంలో సందేహం లేదు… అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తెలుగులో దాదాపు అందరి హీరోలతోనూ కలిసి నటించింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే గత రెండు సంవత్సరాలుగా ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఇలాంటి సమయంలో కాస్త తక్కువ రెమ్యూనరేషనయినా.. ఓకే చెప్పేస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తే… రకుల్ మాత్రం వారికి షాకిచ్చిందట.

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాలకు హీరోయిన్లను దొరకడం కష్టమైపోయింది. యువ హీరోయిన్లు కొందరు సీనియర్ హీరోల పక్కన నటిస్తే వారి క్రేజ్ ఎక్కడ తగ్గిపోతుందోనని ఎస్కేప్ అవుతున్నారు. అయితే రకుల్ మాత్రం ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోకుండా… క్యాష్ చేసుకునే పనిలో పడిందట. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ‘మన్మధుడు 2’ సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. దీనికి రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే రెమ్యునరేషన్ గా కోటిన్నర డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం రకుల్ ఒక్కో సినిమాకి కోటి రూపాయలు తీసుకుంటుంది. కానీ ‘మన్మధుడు 2’ కి మాత్రం తన రెమ్యునరేషన్ అమాంతంగా పెంచేసిందట. అయినప్పటికీ నిర్మాతలు వెనుకడుగు వేయకుండా… రకుల్ డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ఏదేమైనా ఆఫర్లు లేకపోయినా కూడా తన రెమ్యునరేషన్ పెంచి రకుల్ అందరినీ ఆశ్చర్యపరుస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus