బిగ్‌బాస్‌4: ఈ రోజు నామినేషన్స్‌ భలే ఘాటు గురూ!

  • October 12, 2020 / 02:01 PM IST

బిగ్‌బాస్‌ హౌస్‌లో సండే ఫన్‌డే ఎలాగో… మండే అందరి ఒళ్లు ‘మండే’ అలాగే. నామినేషన్ల రోజు కాబట్టి ఇంటి సభ్యులు హాట్‌ హాట్‌గా ఉంటారు. అయితే ఈ వారం నామినేషన్ల వేడి మామూలుగా కనిపించండం లేదు. దానికి తోడు బిగ్‌బాస్‌ కూడా దానికి కాస్త మిర్చీ ఫ్లేవర్‌ యాడ్‌ చేశారు. ఎండు మిర్చి దండలు మెడలో వేసి నామినేట్‌ చేసి, కారణాలు చెప్పమన్నారు. మరి ఈ వారం ఎవరిని ఎవరు నామినేట్‌ చేశారో రాత్రి చూడాలి. అయితే ప్రోమో ప్రకారం ఈ రోజు మెహబూబ్‌ టాప్‌ నామినేటడ్‌ పర్షన్‌లా కనిపిస్తోంది. మొత్తంగా ఐదుగురు నామినేట్‌ చేసినట్లున్నారు. అందుకే అతని కళ్లల్లో నీళ్లు కూడా తిరిగాయి.

హారికకు రెండు, మూడు మిర్చి దండలు వేస్తా అంటూ కుమార్‌ సాయి నామినేట్‌ చేశాడు. అంతగా ఆమెను ఎందుకు టార్గెట్‌ చేశారో చూడాలి. కాలు నొప్పి అంటూ కుంటి సాకులు చెబుతున్నాడంటూ నోయల్‌ను దివి నామినేట్‌ చేసినట్లుంది. సింపతీ కోసం ఇదంతా చేస్తున్నట్లుగా ఉంది.. ఫేక్‌ అనిపిస్తున్నారు అని కూడా చెప్పింది. నేను నచ్చకపోతే నా గురించి మాట్లాడొద్దు అని మోనాల్‌ అంది. దానికి అభిజీత్‌ మెచ్చుకోవడమూ కనిపించింది. కెప్టెన్సీ టాస్క్‌ సమయంలో సంచాలకుడిగా నువ్వు విఫలమయ్యావని అఖిల్‌ అభిజీత్‌ను నామినేట్‌ చేశాడు. ఆటోమేటిగ్గా అభిజీత్‌… అఖిల్‌ను నామినేట్‌ చేశాడు.

ఈసారి ఇంట్లో కొత్త గొడవులు కనిపిస్తున్నాయి. మెహబూబ్‌, ఆరియానా మధ్య డిస్కషన్‌ జరిగింది. మీ పేరు ఎత్తితే నామినేట్‌ చేసేస్తున్నారు అంటూ ఆరియానా అంటోంది. మరోవైపు కుమార్‌సాయి, సోహైల్‌ మధ్య కూడా అదే పరిస్థితి. వేలు చూపించి మాట్లాడొద్దు అంటూ సోహైల్‌ అంటే.. యాటిట్యూడ్‌ వద్దని కుమార్‌సాయి అంటున్నాడు. చూద్దాం ఈ ఘాటు నామినేషన్‌లో ఇంకేం జరిగాయో.


చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus