‘‘వాగ్దానం చేసినట్లు ఆయన చేస్తున్నాడు. ఎప్పుడనేది ఆయనే చెబుతారు. సుజీత్ విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత కథా చర్చలు మొదలవుతాయి #OG2’’ ఇదీ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీమ్ నిన్న రాత్రి చేసిన ట్వీట్ ఇది. ఇందులో ఏమన్నా కొత్త సమాచారం ఉందా మీరే చెప్పండి. ‘సుజీత్ విదేశాల్లో ఉన్నారు’ అనే ఒక్క మాట తప్ప. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరిప్పుడు ఈ పోస్ట్ చేసి ఉపయోగం ఏమిటి? ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానుల్లో వినిపిస్తున్న మాట ఇదే.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ సినిమాకు కొనసాగింపు ఉంటుందని సినిమా ముగింపు, సినిమా రిలీజ్ తర్వాత ప్రచార కార్యక్రమాల్లో టీమ్ చెబుతూనే వచ్చింది. సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ కూడా ‘సుజీత్ ప్లాన్ చేసుకో.. మనం ‘ఓజీ 2’ చేస్తున్నాం’ అని బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఎక్కడా ఈ ఊపు లేదు. దర్శకుడు సుజీత్.. నానితో చేస్తున్న ‘బ్లడీ రోమియో’ సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. సడెన్‌గా ఇప్పుడు ‘ఓజీ 2’ ప్రకటన రిపీట్ చేశారు..
అందులో ఏమన్నా సమాచారం ఇచ్చారా అంటే లేదనే చెప్పాలి. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఇచ్చిన శోకంలో ఉన్న పవన్ ఫ్యాన్స్‌కి ఈ వార్త కాస్త రిలీఫ్ అనే చెప్పాలి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు చేయబోయే రెండో ‘ఓజీ’ ఏంటి అనేది ఆసక్తికరం. ఎందుకంటే ఈ సినిమాకు కొనసాగింపు రాయాలి అంటే మొత్తంగా కొత్త ప్లాట్ ఏర్పాటు చేసుకోవాలి. అయితే ‘ఓజీ’ జీవితంలో జపాన్ ఎపిసోడ్‌ను కథగా తీసుకుంటే ‘ఓజీ’ గతం సినిమాగా చేయొచ్చు.
మరి సుజీత్ విదేశాల నుండి వచ్చాక ఏం మాట్లాడుకుంటారో, ఏం చెబుతారో చూడాలి. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా ఉండదు అనే పుకారుకు ఈ వార్త మందులా ఉంది. ఇదంతా ఓకే కానీ రామ్ తాళ్లూరి – సురేందర్ రెడ్డి (సూరి) సినిమా సంగతి ఏమైందో ఇంకా చెప్పలేదు. ఉంటుందీ అంటున్నారు పనులు ప్రారంభించడం లేదు ఏంటో?