Sreeleela: శ్రీలీల స్టార్ హీరోయిన్ అవ్వడానికి ఈ రెండు హిట్లు సరిపోతాయా?

  • December 30, 2022 / 03:58 PM IST

పెళ్ళిసందD చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రీలీల. కన్నడ అమ్మాయే అయినప్పటికీ ఈమె అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. కే.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్ళిసందD చిత్రం మొదటి రోజు ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకున్నప్పటికీ… సినిమా అసాధారణమైన కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చెప్పాలంటే ఇది ఒక లాటరీ హిట్. విడుదలకు ముందు పాటలు సూపర్ హిట్ అవ్వడం..పాత పెళ్ళిసందడి క్రేజ్..

అలాగే శ్రీలీల లుక్స్ వల్ల గట్టెక్కిన సినిమా ఇది.తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాని తెరకెక్కించడం కూడా హ్యూజ్ ప్లస్ అయ్యింది. ఒక్క గ్లామర్ తో తప్ప శ్రీలీల ఈ మూవీతో అట్రాక్ట్ చేసింది ఏమీ లేదు. ఇక ఆమె రెండో సినిమా ధమాకా కూడా ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్. ఇది కూడా లాటరీ హిట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో కొత్తదనం ఏమీ ఉండదు. మనం ఎప్పుడూ చూసే రవితేజ నటనే. కథ అయితే రౌడీ అల్లుడు, కింగ్ , అజ్ఞాతవాసి , అల వైకుంఠపురములో వంటి చిత్రాలను మిక్స్ చేసినట్టు ఉంటుంది.

అయినా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తుంది అంటే.. ముందు నుండీ చేసిన ప్రమోషన్స్, పాటలు సూపర్ హిట్ అవ్వడం, శ్రీలీల లుక్స్ అని చెప్పాలి. ధమాకా కూడా లాటరీ హిట్ అయితే శ్రీలీల కెరీర్ కు ఏమాత్రం హెల్ప్ అవుతుంది అనే డౌట్ ఎవ్వరికైనా రావచ్చు. అయితే ధమాకా లో శ్రీలేల డాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పెర్ఫార్మెన్స్ కు స్కోప్ లేకపోయినా ఉన్నంతలో చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది.

ఈ సినిమా సక్సెస్ విషయంలో ఆమెకు మేజర్ క్రెడిట్ దక్కింది. కాకపోతే మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది అంటున్నారు. అదొక్కటే మైనస్ గా కనిపిస్తుంది. మరోపక్క రామ్ – బోయపాటి కాంబినేషన్లో చేస్తున్న సినిమా కానీ, బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాలో ఈమె చేస్తున్న కూతురి పాత్ర కానీ ఈమెకు మైనస్ అయితే కాదు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus