భారీ ధరకు అమ్ముడు పోయిన ఎన్టీఆర్ బయోపిక్ ఓవర్సీస్ రైట్స్!

  • September 14, 2018 / 12:37 PM IST

తెలుగు చిత్రాలు విదేశాల్లోనూ భారీ కలక్షన్స్ అందుకుంటున్నాయి. ప్రీమియర్ షోల ద్వారా భారీ మొత్తాన్ని రాబడుతున్నాయి. అందుకే మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోల సినిమాలకు గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న అరవింద సమేత వీర రాఘవని 11 కోట్లకు అమెరికాలోని ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్టు తెలిసింది. ఈ విషయంతో నందమూరి అభిమానులు ఆనందపడిపోతుంటే.. మరో శుభవార్త తెలిసింది. అదే మహానటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ మూవీ రికార్డు ధరకి ఓవర్సీస్ రైట్స్ అమ్మడుపోవడం.

క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తోంది. ఏఎన్నార్ గా సుమంత్, కృష్ణ గా సుధీర్ బాబు, చంద్రబాబు నాయుడిగా రానా నటించనున్న ఈ చిత్రంలో నరేష్ నిర్మాత బొగట వెంకట సుబ్బారావు పాత్రలో కనిపించనున్నారు. ఇలా అనేకమంది స్టార్స్ నిండిన ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్  20 కోట్ల దాకా ఒప్పందం కుదిరినట్టు టాక్ వినిపిస్తోంది. దీని బట్టి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఎన్టీఆర్ బయోపిక్ పై చాలా క్రేజ్ ఉందని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus