అల్లరి నరేష్ ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్‌కు ఓ క్యూట్ బ్యూటీ పరిచయమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన ‘శక్తి’ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నటించి తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది.
10 ఏళ్ళ క్రితం చాలా క్యూట్‌గా, హోమ్లీగా కనిపించిన ఈ భామ.. ఆ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు.అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి.
ఆ ఫోటోలు చూసిన వాళ్లంతా.. ‘ఈమె ఆ హీరోయినేనా?.. అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం’ అని షాక్ అవుతున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆమె లుక్ అంతా మారిపోయింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో ఈపాటికే మీకు స్ట్రైక్ అయ్యుంటుంది కదా. ఆమె మరెవరో కాదు.. మన యాక్ట్రెస్ మంజరి ఫడ్నీస్.ఆమె లేటెస్ట్ లుక్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. స్క్రీన్ మీద అందమైన నటిగా మాత్రమే తెలిసిన ఆమె.. వాస్తవానికి ఒక మంచి సింగర్.
ఆర్మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. 2003లో ఛానల్ వి (Channel V)లో వచ్చిన ‘పాప్ స్టార్స్ ఇండియా’ షోలో టాప్ 8 ఫైనలిస్టుగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన సింగింగ్ టాలెంట్‌ను కేవలం స్టేజ్ వరకే పరిమితం చేయకుండా, 2009లో వచ్చిన ‘ముత్తిరై’ అనే తమిళ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మెప్పించింది.గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌లోనూ తన సత్తా చాటిన ఈ బ్యూటీకి.. హిందీలో ‘జానే తు… యా జానే నా’ సినిమాతో భారీ బ్రేక్ దొరికింది.
ఈ చిత్రంలో మంజరి నటనకు ఏకంగా ప్రతిష్టాత్మక ‘స్టార్ డస్ట్’ అవార్డు వరించింది. కేవలం హిందీ, తెలుగుకే పరిమితం కాకుండా.. తమిళం, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ ఇలా పలు భాషల్లో నటించి పాన్-ఇండియన్ అప్పీల్ తెచ్చుకుంది. ఇక వ్యక్తిగతంగా ఆమె పెద్ద జంతు ప్రేమికురాలు. పుణెలోని తన ఇంట్లో పెంపుడు పిల్లులు, పక్షులతో టైమ్ స్పెండ్ చేయడం ఆమెకెంతో ఇష్టం. తన 17వ ఏటనే నాన్-వెజ్ మానేసి కంప్లీట్ వెజిటేరియన్‌గా మారిపోయిందట.
ఖాళీ దొరికితే పియానో వాయిస్తూ పాటలు పాడటం రెగ్యులర్ హాబీగా మార్చుకుందీ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. 10 ఏళ్ళ క్రితం చూసిన ఆ హోమ్లీ బ్యూటీకి, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతున్న ఈ ట్రెండీ గర్ల్‌కి అస్సలు సంబంధమే లేదన్నట్టుగా మారిపోయింది. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత అస్సలు గుర్తుపట్టలేని లుక్స్‌తో, మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో మంజరి ఫడ్నీస్ మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.