ప్రభాస్ తర్వాత మళ్ళీ ఎన్టీఆరే

నిన్న సాయంత్రం వరకూ ఎన్టీయార్ కి యాక్సిడెంట్ అయ్యిందని, గాయాలపాలయ్యాడని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దాన్ని ఎన్టీయార్ పి.ఆర్ టీం ఖండిస్తూ కొన్ని పాపులర్ వెబ్ సైట్స్ లో ఆర్టికల్స్ కూడా రిలీజ్ చేయించింది. అయినప్పటికీ.. ఈ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొని ఉండడంతో ఎన్టీయార్ జిమ్ చేస్తున్న ఒక ఫోటోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎన్టీయార్ ఈ బాడీ బిల్డ్ చేస్తోంది త్రివిక్రమ్ సినిమా కోసమా లేక రాజమౌళి సినిమా కోసమా అనేది పక్కన పెడితే కండలు తిరిగిన దేహంతో షాక్ ఇస్తున్నాడు. ముఖ్యంగా ఎన్టీయార్ ట్రైసెప్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మేటర్ ఏంటంటే.. ఇప్పటివరకూ మన టాలీవుడ్ లో చాలామంది హీరోలు బాడీ బిల్డ్ చేశారు, సిక్స్ ప్యాక్ లు చేశారు. కానీ “ఛత్రపతి”లో ప్రభాస్ ఒక్కడే ట్రైసెప్ ట్రై చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్టీయార్ తన తాజా చిత్రం కోసం ఇలా ట్రైసెప్ వర్కవుట్ చేయడం హైలైట్ అవ్వనుంది. చూస్తుంటే ఎన్టీయార్ తన కొత్త సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ మాత్రమే కాదు చిజల్డ్ లుక్ తో కనిపించించనున్నాడని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus