Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

పాన్ ఇండియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh) ఇటీవల ‘ఎస్ ఆర్ హెచ్'(SRH) టీమ్ ఓనర్ అయినటువంటి కావ్యా మారన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు అనగా నవంబర్ 11న గ్రీస్‌ దేశంలో వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో  ఘనంగా జరిగింది. దాదాపు 12 ఏళ్ల నుండీ ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహానికి కోలీవుడ్ కి చెందిన సినీ సెలబ్రిటీలంతా హాజరయ్యి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఓ గ్రూప్ ఫోటోలో అనిరుధ్ తల్లిదండ్రులు, కావ్య మారన్ తల్లిదండ్రులు, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. రజినీకాంత్ సతీసమేతంగా ఈ వేడుకకు హాజరయ్యారు.

Anirudh

రజినీకాంత్ అనిరుధ్ కి దగ్గర బంధువు అనే సంగతి తెలిసిందే. రజినీకాంత్ సినిమాలకి అనిరుధ్ అందించే మ్యూజిక్ సినిమా మొత్తానికి హైలెట్ అవుతుంటుంది. రజినీకాంత్ సినిమా అనేసరికి స్పెషల్ కేర్ తీసుకుని ఆర్ ఆర్ అందిస్తుంటాడు అనిరుధ్. రజినీకాంత్ కు కూడా అనిరుధ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. తన ప్రతి సినిమాకి అనిరుథ్ సంగీత దర్శకుడిగా ఉండాలని ప్రత్యేకంగా దర్శకనిర్మాతలకి రిక్వెస్ట్..లు పెట్టుకుంటారు రజినీకాంత్. అనిరుధ్ పెళ్ళిలో వీరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ ఫోటోల ద్వారా అర్ధం చేసుకోవచ్చు.

ఇక నవంబర్ 21న చెన్నైలో (Anirudh) అనిరుధ్- కావ్య..ల వెడ్డింగ్ రిసెప్షన్ కూడా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ప్రస్తుతానికైతే అనిరుథ్- కావ్య..ల పెళ్ళి వేడుకకు సంబంధించిన ఫోటోలను ఓ లుక్కేయండి :

బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

 

 

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus