‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ వైరలవుతున్న ఎన్టీఆర్ కొత్త లుక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తవ్వడంతో… రెండో షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు. అయితే మరో హీరో రాంచరణ్ కాలోకి గాయమవ్వడంతో షూటింగ్ ను వాయిదా వేశారు. మరో వారంలో తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారని తాజా సమాచారం. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలూ లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.

ఇప్పటికే ఎన్టీఆర్ విడుదలైన ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతుంది. తాజాగా విడుదలైన ఈ పిక్ చూస్తుంటే యవ్వనంలో కొమరం భీమ్ ఎలా ఉండేవాడో అచ్చంగా అలాగే దిగిపోయాడు తారక్. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లుంటారని సమాచారం. ఇప్పటికే రెండో హీరోయిన్ గా నిత్యమీనన్ ఎంపికయ్యిందట. గిరిజన యువతిగా ఎన్టీఆర్ ను ప్రేమించే అమ్మాయిగా ఈమె కనిపించనుందని తెలుస్తుంది. ఇక మొదటి హీరోయిన్ కోసం మొదట బ్రిటిష్ భామ డైసీని అనుకున్నప్పటికీ… కొన్ని కారణాల వలన ఆమె తప్పుకుంది. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం రాజమౌళి వెతుకులాడుతూనే ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus