NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో కలిసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం తారక్ తన రూపాన్ని కంప్లీట్ గా మార్చేస్తున్నారు. రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన స్లిమ్ అండ్ షార్ప్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక మాస్ హీరో బాడీ లాంగ్వేజ్‌ను ఇంతలా మార్చడం వెనుక ప్రశాంత్ నీల్ ఒక పక్కా ప్లానింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. మొదట్లో ఈ మార్పు చూసి కంగారు పడ్డ ఫ్యాన్స్, ఇప్పుడు తారక్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

NTR

ప్రస్తుతం ‘డ్రాగన్’ టీమ్ కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం జోర్డాన్ చేరుకుంది. ఈ షెడ్యూల్‌లో సుమారు మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే ఎప్పుడూ చేయని విధంగా చాలా రిస్కీ స్టంట్స్ ఈ సినిమాలో చేయబోతున్నారు. ఇందుకోసం ఆయన బాడీ చాలా చురుగ్గా ఉండాలని, అందుకే ఈ రేంజ్ వెయిట్ లాస్ అయ్యారని తెలుస్తోంది. ఈ జోర్డాన్ షెడ్యూల్ సినిమాకే ఒక హైలైట్ కాబోతోంది.

తారక్ ఈ సినిమా కోసం దాదాపు 18 కిలోల బరువు తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇది కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, కండరాలు కూడా షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గడ్డం పెంచి, చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్, నీల్ సినిమాల్లో ఉండే ఆ డార్క్ అండ్ రగ్డ్ షేడ్‌కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతోంది. ఈ కొత్త మేకోవర్ చూశాక, ‘డ్రాగన్’ లో తారక్ క్యారెక్టరైజేషన్ ఎంత పవర్‌ఫుల్ గా ఉండబోతోందో అర్థమవుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ స్టార్ టోవినో థామస్ విలన్ గా కనిపించబోతున్నారు. అనిల్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో భాగం కావడంతో సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రశాంత్ నీల్ తన గత సినిమాల కంటే కూడా ఈ ప్రాజెక్ట్‌ను మరింత లార్జర్ దేన్ లైఫ్ స్టోరీగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 25న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus