RRR Release Date: ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్న రాజమౌళి!

Advertisement

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రవర్తన చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కు సంబంధించి గత కొన్నిరోజులుగా అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ వార్తలు చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డేకు లేదా ఉగాదికి వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో రిలీజ్ డేట్ ను మళ్లీ మార్చాల్సిన అవసరం ఏముందని ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి ఆర్ఆర్ఆర్ మేకర్స్ అస్సలు స్పందించడం లేదు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా అక్టోబర్ లోనే రిలీజయ్యే పరిస్థితి ఉంటే మేకర్స్ స్పందించి రిలీజ్ డేట్ గురించి స్పష్టత ఇస్తే బాగుంటుంది. సినిమాల గురించి తప్పుగా ప్రచారం జరిగితే చిన్న సినిమాల నిర్మాతలు సైతం వేగంగా స్పందించి ఫేక్ న్యూస్ కు చెక్ పెడుతున్నారు.

దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి జరుగుతున్న ప్రచారం సినిమాకు నష్టం చేకూర్చేలా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి సినిమాకు సంబంధించి స్పష్టత ఇచ్చి ఫ్యాన్స్ లో నెలకొన్న సందేహాలకు ఎప్పుడు చెక్ పెడతారో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి వ్యవహరిస్తున్న తీరు ఫ్యాన్స్ కు నచ్చడం లేదని రిలీజ్ డేట్ వార్తల వల్ల ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారని సమాచారం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news