RRR Team: రాజమౌళితో ఎన్టీఆర్ వాలీబాల్!

  • July 27, 2021 / 11:14 AM IST

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగా నందమూరి అభిమానులు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాల స్థాయి అమాంతంగా అకాశాన్ని దాటేసింది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు బ్లాస్ట్ అవుతాయో ఊహలకు కూడా అందడం లేదు. ఇక షూటింగ్ ద్వారా ఆర్ఆర్ఆర్ మధ్య అనుబంధం కూడా మరింత దగ్గరైంది.

రామ్ చరణ్, రామారావు, రాజమౌళి మధ్య ఇదివరకే మంచి స్నేహం ఉంది. ఇక షూటింగ్ మొదలైనప్పటి నుంచి తుది దశ వరకు వారి స్నేహం మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఇక అప్పుడప్పుడు షూటింగ్ గ్యాప్ లో రాజమౌళి, హీరోలతో కలిసి ఆటలు ఆడుతూ ఉండేవారట. ఇక వాలీబాల్ ఆడుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వీడియోలో జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి చాలా ఎనర్జిటిక్ తో ఆడుతున్నట్లు అనిపిస్తోంది.

యూనిట్ సభ్యులు కూడా స్టార్స్ తో చాలా సరదాగా ఆడుకోవడం నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. ఇక రామ్ చరణ్ అక్కడ ఉన్నాడో లేదో వీడియోలో అయితే కనిపించలేదు. ఇక ఆర్ఆర్ఆర్ ఆల్ మోస్ట్ ఫినిష్ అవ్వడానికి వచ్చేసింది. ఇక కరోనా గొడవ లేకపోతే సినిమా అక్టోబర్ 13న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus