ఓనం స్పెషల్ : అనుమప అందాలకు మతిపోవాల్సిందే

  • August 21, 2021 / 03:21 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్స్ లో ఆడియన్స్ నుండి ఒకింత ప్రత్యేకంగా క్రేజ్ దక్కించుకున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు అని చెప్పకతప్పదు. స్వతహాగా కేరళ భామ అయిన అనుపమ, 2015లో మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అయింది. అక్కడ మంచి సక్సెస్ కొట్టిన ఆ మూవీని తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేయగా ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అందుకుంది.

కాగా తెలుగు వర్షన్ లో కూడా నటించి ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా మంచి పేరు దక్కించుకున్నారు అనుపమ పరమేశ్వరన్. నిజానికి అంతకముందు నితిన్ హీరోగా త్రివిక్రమ్ తీసిన అఆ లో ఒక చిన్న రోల్ చేసారు అనుపమ, ఆ పాత్ర కూడా ఆమెకు బాగా పేరు తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి తెలుగులో అనేక సినిమాల ఛాన్స్ లతో కొనసాగుతున్న అనుపమ శతమానంభవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నదీ ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నిఖిల్ సరసన 18 పేజెస్ మూవీ లో నటిస్తున్నారు.

ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే అనుపమ నేడు ఓనం పండుగను పురస్కరించుకుని ట్రెడిషనల్ వేర్ లో దిగిన తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో అనుపమ కట్టిన ట్రెడిషనల్ శారీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట ఎంతో వైరల్ అవుతున్నాయి. మొదటి నుండి ట్రెండ్ కి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు తన స్టైల్ ని చేంజ్ చేస్తూ ఉండే అనుపమ, నేడు ఈ ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనం ఇవ్వడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

1

2

3

4

5

6

7

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus