అంజలి, శ్రియలను హీరోయిన్లుగా ఫైనల్ చేసిన బోయపాటి

  • February 24, 2020 / 12:39 PM IST

పూటకో హీరోయిన్ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నప్పటికీ.. సీనియర్ హీరోల హీరోయిన్ కష్టాలు మాత్రం తీరడం లేదు. సీనియర్ హీరోయిన్లు మెల్లమెల్లగా ప్రాభవడం కోల్పోతుండడం ఒక కారణమైతే.. పాపులారిటీ ఉన్న కొందరు సీనియర్ హీరోయిన్లు కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతుండడం మరో కారణం. కొత్త హీరోయిన్లను తీసుకుంటే సెట్ అవుతారో లేదో అనే భయం కంటే బిజినెస్ & మార్కెట్ పరంగా మైనస్ గా మారతారేమోననే భయం ఎక్కువ. అందుకే.. పెద్దగా క్రేజ్ లేకపోయినా ఆల్రెడీ హీరోల సరసన సరిపోయిన భామలనే ఎంపిక చేసుకొంటున్నారు.

ఇప్పుడు బాలయ్య-బోయపాటిల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా కోసం కేతరీన్, సోనాక్షి సిన్హా వంటి నటీనటులను సంప్రదించినప్పటికీ.. వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వకపోవడంతో బోయపాటికి బాలయ్య పాత హీరోయిన్స్నే రిపీట్ చేయాల్సి వచ్చింది. బాలయ్యతో “చెన్నకేశవరెడ్డి, పైసా వసూల్, గౌతమీపుత్ర శాతకర్ణి” వంటి సినిమాలు చేసిన శ్రియాను మెయిన్ హీరోయిన్ గా.. బాలయ్యతో “డిక్టేటర్”లో రొమాన్స్ చేసిన అంజలిని మరో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలవ్వనుంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus