Bandla Ganesh: పవన్ కళ్యాణ్ కు గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన బండ్ల గణేష్…ట్వీట్ వైరల్!

  • July 4, 2023 / 02:09 PM IST

నేడు గురు పౌర్ణమి కావడంతో ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తన గురువుగారు అయినటువంటి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ఆరాధ్య దైవంగా భావించే సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చిన దేవర అంటూ సంబోధిస్తూ బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే తన గురువుగారు అయినటువంటి పవన్ కళ్యాణ్ కు నేడు ప్రత్యేకంగా ఈయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…. గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుగారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలని తెలియజేశారు. మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి మీరు అనుకున్నవన్నీ సాధించాలి. మీ కృషితో మీరు అనుకున్న పనులన్నీ జరగాలని కోరుకున్నారు. ఇక మీ స్థాయి స్థానం తెలిసినవాడిగా చెబుతున్నాను.

పవన్ కళ్యాణ్ పేరును ఉపయోగించుకొని నేను లబ్ధి పొందను అవసరమైతే నా సహాయం మీకు చేస్తాను లేకపోతే దూరంగా ఉంటాను. అంతేకానీ మీ పేరును వాడుకొని లాభం పొందను. మీరు ఎల్లప్పుడూ మీ మంచి మనసు లాగే నిస్వార్థమైన మనసుతో పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఈయన ట్వీట్ చేస్తూ…

ఈ ట్వీట్ ను పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేశారు. ఇలా (Bandla Ganesh) బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పట్ల తనకున్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus