“గబ్బర్ సింగ్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఇటు పవన్ కళ్యాణ్ కు సూపర్ స్టార్ డమ్ తీసుకురావడంతోపాటు.. ఆయన అభిమానులకు దాదాపు 12 ఏళ్ళ తర్వాత విందు భోజనం పెట్టాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన “సర్దార్ గబ్బర్ సింగ్”కు కూడా తొలుత హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడేమో అనుకొన్నారందరూ. కానీ.. సంపత్ నంది చేతుల మీదుగా ఆ అవకాశం బాబీ దక్కించుకొన్నాడు.
అయితే.. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ హీరోగా ఎ.ఎం.రత్నం నిర్మాణంలో రూపొందనున్న “వేదాలమ్” చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈమేరకు మీటింగులు కూడా అయ్యాయని, అందుకే హరీష్ శంకర్ “సుబ్రమణ్యం ఫర్ సేల్” తర్వాత మరో సినిమా అంగీకరించలేదని అందరూ అనుకొంటున్నారు.
ఈ విషయంలో నిజనిజాలు ఎంతో తెలియదు కానీ.. ఒకవేళ ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యిందంటే మాత్రం పవర్ స్టార్ అభిమానులకు థియేటర్లో చింపడానికి పేపర్లు సరిపోవు!