Janhvi Kapoor: అమ్మా… శ్రీదేవి కూతురా నువ్వైనా ఓ క్లారిటీ ఇవ్వొచ్చుగా!

Advertisement

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుని టాలీవుడ్‌కి తీసుకురావాలనే టాలీవుడ్‌ లీక్‌ వీరుల కోరిక ఈ సారైనా నెరవేరుతుందా? ఏంటీ… మళ్లీ జాన్వి చర్చ మొదలైందా.. అనుకుంటున్నారా… ఏం చేస్తాం మొదలెట్టారు మరి. టాలీవుడ్‌లో కుర్ర స్టార్‌ హీరోల సినిమా ఏదైనా మొదలైతే చాలు… ‘ఆ సినిమా జాన్వి నటిస్తుందా?’ అంటూ ఓ ప్రశ్న లేపుతారు. కొద్ది రోజులు నడిచాక… ఆమె నటించడం లేదు ఇంకో హీరోయిన్‌ను తీసుకున్నారు అంటూ ముగించేస్తారు. ఇప్పుడు మరోసారి ఆ తంతు మొదలైంది.

‘పుష్ప 1’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ ‘ఐకాన్‌’ మొదలవ్వనున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా… ‘పుష్ప 2’ వచ్చే ముందు ఓ సినిమా చేయాలని బన్నీ అనుకుంటున్నాడట. దీంతో ఆ సినిమా తారాగణం ఎంపిక వేగవంతం చేశారు. అందులో భాగంగా జాన్వి కపూర్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. నిజానికి గతంలో ఇలా చాలా సార్లు వినిపించింది. మహేష్‌ – త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ సినిమా కోసం ట్రై చేశారు అని వార్తలొచ్చాయి. అవి అవ్వలేదు.

అయితే ‘ఐకాన్‌’ విషయంలో అవకాశాలు ఎక్కువ అనేది ఓ పుకారు. కారణం జాన్వి తండ్రి, నిర్మాత అయిన బోనీ కపూర్‌తో దిల్‌ రాజు మంచి అనుబంధమే ఉంది. దీంతో తన ‘ఐకాన్‌’ కోసం దిల్‌ రాజు… బోనీని అడుగుతారేమో అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే శ్రీదేవి కూతురు ఎంట్రీ మెగా బ్యాచ్‌తో అవ్వబోతోంది. చూద్దాం… జాన్వి ఈసారి ఏం చేస్తుందో.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus