Ram Charan, Kiara Advani: మరోసారి చెర్రీతో రొమాన్స్ చేయనున్న కియారా అద్వానీ.. ఇదే ప్రూవ్..!

Advertisement

చరణ్- శంకర్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని.. దీనికి దిల్ రాజు నిర్మాత అని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండీ హీరోయిన్ ఎవరు అనే చర్చ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో పూజా హెగ్డే, రష్మిక, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి అంటూ చాలా మంది స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి.ఓ దశలో కియారా పేరు కూడా వినిపించినప్పటికీ.. చిత్ర యూనిట్ సభ్యులు అప్పుడు క్లారిటీ ఇవ్వలేదు.

మొత్తానికి ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘#RC15’ యూనిట్ ఓ పోస్టర్ ద్వారా కియారా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు కన్ఫర్మ్ చేశారు.ఈ ఫొటోలో ఆమె దర్శకుడు శంకర్ తో ముచ్చటిస్తున్నట్టు కనిపిస్తుంది. చరణ్ తో జతకట్టడం కియారా కి ఇది రెండో సారి. గతంలో చరణ్.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కూడా ఈమెనే హీరోయిన్ గా నటించింది.

నిజజీవితంలో కూడా చరణ్ తో కియారాకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఉపాసనకి కూడా ఈమె మంచి ఫ్రెండ్. ఇక చరణ్- శంకర్ ల మూవీకి తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. బుర్రా సాయి మాధవ్ కూడా ఈ ప్రాజెక్టుకి రైటర్ గా పనిచేస్తుండడం విశేషం.దిల్ రాజు బ్యానర్లో రూపొందనున్న 50వ చిత్రం కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. తెలుగు,తమిళ్ తో పాటు బాలీవుడ్లో కూడా ఇది ఏక కాలంలో తెరకెక్కనుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus