‘రెడ్’ ఫస్ట్ సింగిల్ రివ్యూ..!

  • March 6, 2020 / 07:11 PM IST

గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ … ఫుల్ జోష్ తో ‘రెడ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కాబోతుంది. రామ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్న ఈ చిత్రంలో ‘నేల టిక్కెట్’ ఫేమ్ మాళవిక శర్మ, అలాగే నివేదా పేతు రాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల్ చెయ్యగా.. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ ను కూడా విడుదల చేశారు. సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చిన ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే ఈ పాట.. ఓపెనింగ్ నుండీ చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి ఎంతో జోష్ తో ఆలపించిన ఈ పాట ప్రతీ ఒక్కరి లోనూ హుషారుని నింపేలానే ఉంది. కచ్చితంగా ఒక్కరూ ఈ పాటని రిపీట్ మోడ్ లో వినాలనే ఉంది. మెలోడీస్ కు పెట్టింది పేరు మణిశర్మ అని మరోసారి ఈ పాట ప్రూవ్ చేసింది. ఇంకెందుకు లేటు మీరుకూడా ఈ పాటని ఓ సారి వినెయ్యండి.


పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus