బాహుబలి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోందోచ్

  • February 5, 2020 / 05:24 PM IST

అయిదేళ్లు కష్టపడి తెలుగు సినిమా స్థాయి ఖండాంతరాలు వ్యాపించేలా చేసిన ఘనత రాజమౌళి-ప్రభాస్ లది. ఈ ఇద్దరి కష్టానికి ప్రజలు అఖండ విజయాన్ని అందించి ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఎవరూ రిపీట్ చేయలేని సక్సెస్ ను అందించారు. ఆ ప్రేక్షకుల రుణం తీర్చుకొనేందుకు మళ్ళీ ఒక చిత్రరాజాన్ని అందివ్వడానికి సన్నద్ధమవుతున్నారు రాజమౌళి & ప్రభాస్. అది కూడా తమ స్వంత ప్రొడక్షన్ హౌస్ లో. రాధాకృష్ణతో సినిమా అనంతరం ప్రభాస్.. “ఆర్.ఆర్.ఆర్” అనంతరం రాజమౌళి కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ మొదలెట్టానున్నారు. టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ & యాక్టర్స్ ను ఎంకరేజ్ చేయడం ఆ బ్యానర్ ముఖ్య ధ్యేయం.

అయితే.. ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ను “ఛత్రపతి” తరహాలో సోలో హీరోగా ప్రెజంట్ చేయనున్నాడు రాజమౌళి. ఈ వార్త తెలిసినప్పట్నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈమేరకు ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తే సంతోషం!

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus