బిజీ అయిపోతున్న మిల్క్ వైట్ బ్యూటీ

  • September 8, 2018 / 12:54 PM IST

“బాహుబలి” లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ లో నటించిన తర్వాత సరైన ఆఫర్లు లేక తమన్నా కెరీర్ పరంగా చాలా స్లో అయిపోయిందని టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే ఆ సినిమా తర్వాత అమ్మడికి సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. కొన్నాళ్ళ విరామం అనంతరం తమన్నా మళ్ళీ మెలమెల్లగా బిజీ అవుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘క్వీన్’ తెలుగు రీమేక్ తో పాటు.. ‘F 2″, ‘సైరా, కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ సినిమా మరియు తమిళంలో ‘కన్నె కలైమాని’ అనే సినిమాలో కూడా నటిస్తోంది.

ఇవన్నీ కాకుండా తాజాగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో తాజా ప్రాజెక్టులో కూడా హీరోయిన్ గా ఎంపిక అయినట్టు వెల్లడించింది. ట్రైడెంట్ ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తారట. ఈ సినిమాలో హీరో విశాల్. విశాల్ తో నటించడం తమన్నాకు ఇది రెండో సారి. గతంలో తమన్నా ‘కత్తి సండై’ సినిమాలో విశాల్ తో నటించింది. ఇక ఈ యాక్షన్ సినిమాను జనవరి 2019 లో సెట్స్ మీదకు తీసుకెళ్తారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus