Ram Charan: రామ్‌చరణ్‌తో ఫ్రెండ్స్‌ తీసే సినిమాపై కాస్త క్లారిటీ!

  • December 16, 2021 / 04:08 PM IST

రామ్‌చరణ్‌ ఖాతాలో మరో పాన్‌ ఇండియా సినిమా చేరింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో త్వరలో పాన్‌ ఇండియా స్థాయిలో అలరించబోతున్న రామ్‌ చరణ్‌, ఆ తర్వాత కూడా అదే పని చేయబోతున్నాడు. అయితే ఒక సినిమా గ్యాప్‌ ఇచ్చి. పాన్‌ ఇండియా మూవీ మొదలుపెడతాడు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది… ఆ సినిమా ఏంటి అనేది. అవును గౌతమ్‌ తిన్ననూరి సినిమా గురించే మేం చెబుతోంది. క్రీడా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి.

అయితే దీనిపై ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ఇప్పుడు గౌతమ్‌ తిన్ననూరి ఈ విషయంలో బాలీవుడ్‌ మీడియాలో చిన్న హింట్‌ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా గురించి ఇప్పుడు చర్చంతా. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ అంటూ రెండు డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలు చేసిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. ఇప్పుడు బాలీవుడ్‌ ‘జెర్సీ’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పనులు అయ్యాక… రామ్‌చరణ్‌ సినిమా కథ మీద కూర్చుంటాడట. క్రీడా నేపథ్య సినిమా అనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది.

అయితే ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో వచ్చే క్రీడా నేపథ్య చిత్రమట. దీంతో ఈ సినిమా ఎవరో ప్రముఖ క్రీడాకారుడి లైఫ్‌ స్టోరీ అనే పుకార్లు మొదలయ్యాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా అంటే…ఎవరో ఒక క్రీడాకారుడి జీవితమే చూపించాలి. దీంతో ఆ ఆటగాడు ఎవరు అనే చర్చ జోరుగా నడుస్తోంది. క్రికెటరా? ఫుట్‌ బాలరా? లేక ఇంకేదైనానా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న మరో పుకారు. ఈ సినిమాలో చిరంజీవి కీలక పాత్రలో కనిపిస్తారని. దీనిపై కూడా గౌతమ్‌ క్లారిటీ ఇచ్చేశాడు.

ఆయనకు సరిపడే పాత్ర నా కథలో లేదని చెప్పేశాడు. అంతేకాదు పాన్‌ ఇండియాను మించే ఈ సినిమా ఉంటుంది అని చెప్పాడు. మరి దాని అర్థమేంటో మనకు తెలియదు. ఇక ఈ సినిమా సంగతికొస్తే… దీనిని చరణ్‌ స్నేహితులైన యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్నారు. చరణ్‌ – శంకర్‌ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా మొదలవుతుందని అంచనా. అయితే ఎప్పుడు, ఎలా, ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus