RRR Movie: ఆర్ఆర్ఆర్ రేర్ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమే!

  • December 12, 2022 / 05:05 PM IST

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ సినిమా విడుదలైనా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. తన మార్కెటింగ్ స్ట్రాటజీలతో జక్కన్న ప్రతి సినిమా సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్ఆర్ఆర్ మూవీని డబ్ చేసి జపాన్ లో రిలీజ్ చేయగా అక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం. ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ లలో ఈ సినిమా ఒకటిగా నిలవడం హాట్ టాపిక్ అవుతోంది.

జపాన్ లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను సాధించిన సినిమా ఏదనే ప్రశ్నకు ముత్తు సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ ఆ సినిమా కలెక్షన్లను కూడా దాటేయడంతో చరణ్, తారక్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించి అతి త్వరలో అధికారిక అప్ డేట్ రానుంది. ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాజమౌళి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం జక్కన్న ఏకంగా 4 సంవత్సరాల సమయం కేటాయించారు. జక్కన్న తర్వాత మూవీ మహేష్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ వచ్చే ఏడాది సెకండాఫ్ లో మొదలుకానుంది. కేఎల్ నారాయణ సోలో నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుండగా మహేష్ కు జక్కన్న కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జక్కన్న ఈ సినిమాలోని మెజారిటీ సీన్లను విదేశాల్లో షూట్ చేయనున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus